Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలం లోని రామానుజాపురం గ్రామపం చాయతీ పరిధి ఎరుకల నాంచారమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ లోకిని రాజు, తెలంగాణ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేతిరి బిక్షపతి, పల్లకొండ భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్యకు గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందించారు. అనంతరం జాతర వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. నాలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ఎరుకల కులస్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చే త నాంచారమ్మ భక్తులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం లేదని కలెక్టర్ దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఎస్టిమేట్ పంపించాల్సిందిగా పీఆర్ ఏఈ పూర్ణచందర్‌ను ఆదేశించారు. ఎరుకల సంఘం నాయకులతో కలిసి వెళ్లి నాంచారమ్మ జాతర రోడ్డును ఏఈ పరిశీలించారు. మే 5న జరిగే జాతర కోసం తాగునీటి వసతి ,రోడ్డు సౌకర్యంతో పాటు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరగా కలెక్టర్ స్పందించడం పట్ల నాయకులు హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేతరి రాజు, కెంసారం రాజు, మానుపాటి రమేష్, పాలకుర్తి సురేష్, దాసరి గంగయ్య, దాసరి సమ్మయ్య,కేతిరి రమేష్, పాలకుర్తి రాజు తదితరులు ఉన్నారు.