Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్ ప్రకారం ప్రత్యేకమైన మిషన్లో నిల్వ ఉంచి దగ్ధం చేయాలని కాలుష్య నియంత్రణ తప్పనిసరి పాటిం చాలని జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో హ్యాండ్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవి గణేష్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యా వరణ ఇంజనీర్ సునీత ఎన్ఐటి ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ ప్రొజెక్టర్ పై బయో మెడికల్ వేస్టేజ్ నియంత్రణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిం చారు. దవఖానాల్లో వ్యర్థ పదార్థాలను ఉపయోగించిన వాటిని ప్రత్యేకమైన మిష న్లో నిలువ చేసి దగ్ధం చేయాలని సూచించారు. వస్తువులను నిల్వ ఉండే ప్రత్యేక మిషన్లను అమర్చుకోవాలని అన్నారు. వరంగల్ మెడికల్ కాలేజ్ తో సమన్వయం చేసుకొని వేస్టేజ్ వస్తువులను అక్కడికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏరియా హాస్పిటల్లో పశువైద్య శాలల్లో ఉన్న వ్యర్థ పదార్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిపారు. బయో మెడికల్ ఆర్థరైజేషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 20 పడకలు కంటే ఎక్కువ ఉంటే ఆథరైజేషన్ తీసుకోవాలని అన్నారు. పెద్ద లిక్విడ్ డ్రైనేజీలో అప్పుడే వదిలేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సైంటిస్ట్ మానస ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్వర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయభాస్కర్ అధికారులు పాల్గొన్నారు.