Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్లీనరీ సభ : ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-భూపాలపల్లి
అభివద్ధి సంక్షేమంలో లే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ టి.ఆర్.ఎస్ రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రాన్ని అనేక రంగాల అభివద్ధి చేయడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలు బలంగా లేనందున జాతీయ రాజకీయాల్లో వెళ్లడానికి టీఆర్ఎస్ బిఆర్ఎస్గా మారిందని అన్నారు. ఏప్రిల్ 27న హైదరాబాదులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ ఎస్ఆర్ గార్డెన్లో సుమారు 3,500 మందితో ప్రతినిధుల సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభల్లో దేశ రాష్ట్ర, సంక్షేమ పథకాల విషయంలో చర్చించుకోవడం జరుగుతుందని అన్నారు. అనేక రాజకీయ తీర్మానాలు చేసి ఆమోదించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 25న జరిగే ప్రతినిధుల సభకు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలలో పండగ వాతావరణంలా జండా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అనంతరం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రం ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ మహాసభలకు పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు,జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ పీ ఏ సిఎస్ చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు, జెడ్పి వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, జిల్లా నాయకులు ఖ్యాతరాజ్ సాంబమూర్తి, గడ్డం కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.