Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఐనవోలు
బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వర్ధన్న పేట నియోజకవర్గ కేంద్రంలోనీ లక్ష్మి గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించే నియోజక వర్గ పార్టీ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు కార్యకర్తలకు బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అద్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలు పునిచ్చారు. సోమవారం ఐనవోలు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని, వర్ధన్నపేట లో ప్లీనరీ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు. టీఆర్ఎస్ నుండి బీఅర్ఎస్గా అవతరించి నేడు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోవడం గర్వకారణం అన్నారు. నేడు జరిగే ప్లీనరీ సభకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొ నాలని అన్నారు. ముందుగా ఉదయం 8 గంటలకు ప్రతి గ్రామంలో పార్టీ పతాకాన్ని పండుగ వాతావరణంలో ఆవిష్కరించాలని సూచించారు. మండలాల వారీగా నిర్దేశించిన జంక్షన్లలో ర్యాలీ చేపట్టాలన్నారు. ఉదయం 10 గంటలకు ప్లీనరీ సభాస్థలికి చేరుకోవాలని సుచించారు. మండలాల వారీగా,డివిజన్ల వారీగా సభా స్తలి వద్ద ఉన్న కౌంటర్ లలో వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్లీనరీలో 13 అంశాల పై తీర్మానాలు ప్రతిపాదిస్తూ చర్చించి ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం లో ఇప్పటివరకు జరిగిన అభివద్ధిపై రాబోయే రోజుల్లో చేయబోయే అభివద్ధి పై వివరిస్తార్నారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబి బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు పాల్గొన్నారు.