Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతా లకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 95 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెం డింగ్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాల ని సూచించారు. సిపిఓ కె.శామ్యూల్ డి ఆర్డిఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పునర్ పరిశీలన
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు పై వచ్చిన 18 అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తరువాత ఇండ్ల కేటాయింపు పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. పేద ప్రజలు ఆత్మగౌర వంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 100శాతం సబ్సీడితో పూర్తి ఉచితంగా అర్హులైన పేదలకు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న 544 ఇండ్లను పారదర్శకంగా పంపి ణీ చేస్తున్నామని, లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ది దారుల జాబితా నోటిస్ బోర్డుపై ఏప్రిల్ 13 న అతి కించి అభ్యంతరాలకు ఏప్రిల్ 21 వరకు గడువు ఇ చ్చామని తెలిపారు. జిల్లాలో గడువు ముగిసే నాటికి జాబితాలో ఉన్న 18లబ్దిదారులపై అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. సదరు అభ్యంతరాల పై క్షేత్రస్థాయి పూర్తి స్థాయిలో పునర్ పరిశీలన చేపట్టిన పిదప 18 ఇండ్ల కేటాయింపు పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి
ఏప్రిల్ 30 లోపు భూపాలపల్లి పట్టణంలో నిర్మి స్తున్న మరో 416 డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మీ సేవా ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 100% సబ్సీడితో పూర్తి ఉచితంగా పేదలకు అందిస్తున్నా మని తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో నిర్మా ణంలో ఉన్న మరో 416 ఇండ్లను పూర్తి పారదర్శ కంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఆ ఇండ్ల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మీ సేవా ద్వారా ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2020 కంటే ముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తు చేసుకున్న వారు రశీదు తో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని, రశీదు లేని పక్షంలో నూతనంగా మీ సేవా ద్వారా ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.