Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
రాయల్ గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ 49, 50 డివిజన్ల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్, చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామన్నారు. గల్లీలకొ చ్చి ముసలి కన్నీళ్లు కారుస్తున్న బీజేపీ నాయకులను దీటుగా ఎదుర్కొవాలి అని అన్నారు. 40 సంవత్స రాల గుడిసె వాసుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన పై ఉన్నది అని అన్నారు. అమిత్ షా ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణకు ఏమైనా ఇస్తాడు అనుకుంటే ఉన్న ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అనడం దురదష్ట కరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి పీఓహెచ్ను ఇస్తాం అంటున్నదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లే దన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వ లేదని, ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు అని అన్నా రు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు అనే క రాష్ట్రాలలో అమలు చేస్తున్నారన్నారు. టీఎస ్ఐపాస్ను భారత పరిశ్రమిక రంగంలో ఉపయోగి స్తున్నారు అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పవర్ హాలిడేస్ ఉన్నాయన్నారు. 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నా ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఎల్ఐసి వంటి లాభాలు ఆర్జించే సంస్థలను ఆదాని అంబానీల కు అప్పగిస్తు న్నారన్నారన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఐన ప్పటికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తీసు కురాలేదు అన్నారు. బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగే అర్హత లేదు అని అన్నారు. అబద్దాలు వల్లించే అమిత్ షా మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజాలు లేరు అని అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వన్నీ కోరుకుంటు న్నారన్నారు. సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యుల పై సీబీఐ ఈడీ లను ఉసిగొల్పుతున్నారన్నారు. 40 సంవత్సరాల నుండి వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ చేస్తుంటే దేవాదాయశాఖ భూములను కేంద్ర ప్రభుత్వనికి అప్పగిస్తే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, కూడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి,మైనార్టీ కమిషన్ సభ్యులు దర్శన్ సింగ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ల పెళ్లి జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు ఏనుగుల మానస రాంప్రసాద్, నెక్కొండ కవిత కిషన్, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.