Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశా నికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ కా ర్యా లయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌తోపాటు మండలంలోని బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బిఆర్ఎస్ జండాను ఆవిష్కరించారు. ఆవి ర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లా డుతూ తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖకు అనే క అవార్డులు అందజేసిందని తెలిపారు. 9ఏళ్ల బిఆర్ ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫ లాలు అందాయన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలం గాణలో ప్రతి కార్యకర్త గులాబీ జెండాను భుజానికి ఎత్తుకొని నేటి వరకు పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్ప లా కాపాడుకుంటానని, గ్రామాల్లో కాంగ్రెస్, బిజెపిల అసత్య ఆరోపణలను కార్యకర్తలు ఖండించాలని పిలు పునిచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అబి వృద్ధి సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్, బిజెపిలు జీర్ణించు కోవడం లేదని ఆరోపించారు. మతం పేరుతో బిజెపి రాజకీయం చేస్తుందని, మత విద్వేషాలను రెచ్చగొ ట్టేందుకే బిజెపి కుట్రచేస్తుందని విమర్శించారు. సీ ఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి ప్రాంతాన్ని టూ రిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నానని, పాలకుర్తి, వల్మి డి,బొమ్మెర గ్రామాలను పర్యాటక కేంద్రంగా అభివృ ద్ధి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పుస్కూరి శ్రీనివాస రావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యా కాంతరావు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరు పుల బాలు నాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, ముదిరాజ్ మహాసభ నియో జకవర్గ ఇన్చార్జి చిక్కుడు రాములు, బిఆర్ఎస్ యువ జన విభాగం రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, మాజీ ఎంపీపీ భూక్య దల్జిత్ కౌర్, వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా డైరెక్టర్ వీరమనేని సోమేశ్వర్రావు, నాయకులు బోనగిరి కృష్ణమూర్తి, సలేంద్ర సోమన్న, పాము శ్రీనివాస్, మారుజోడు సం తోష్, కమ్మగాని నాగన్న గౌడ్, పాము శ్రీనివాస్, ధారావత్ యాకూబ్ నాయక్, గిలకత్తుల సుధాకర్ గౌడ్ ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.