Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్
నవతెలంగాణ-తొర్రూరు
24 గంటల పనిదినాలకు వ్యతిరేకంగా పని గంటలను తగ్గించాలనే నినా దంతో చికాగో నగరంలో మొదలైన ఉద్యమంలో అమరులైన అమరవీరుల స్ఫూర్తి తో మోడీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) మండల కార్య దర్శి మహమ్మద్ యాకూబ్ పిలుపునిచ్చారు. మంగళవారం తొర్రూరు డివిజన్ కేం ద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ప్రజా సంఘాలు సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎండీ యాకూబ్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో మొదలై పని గంటలు తగ్గించాలని చేసే పోరాటంలో వేలాదిమంది కార్మికులు అమరులైన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవ త్సరం మేడేను జరుపుకుంటామన్నారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం మను వాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించే గొంతుల మీద కార్మికులు, కర్ష కులు, రైతాంగం, కూలీలు, ఎస్సీ ఎస్టీలు, పేద వర్గాల హక్కుల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆగడాలను అరికట్టడం కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవే ర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పేద మధ్యతరగతి ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తూ నియంత పా లన కొనసాగిస్తున్నాయని విమర్శించారు. మతతత్వ మోడీ ప్రభుత్వం, గడీల పాల న కొనసాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయ ని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల వెం కటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, రజక వృత్తిదారుల సం ఘం జిల్లా కన్వీనర్ పున్నం సారయ్య, తొర్రూరు మండల అధ్యక్షులు నిమ్మల సోమ య్య తదితరులు పాల్గొన్నారు.