Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అని, ప్రభుత్వాలను ప్రజలకు అందుబాటులో తె చ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం మానుకోటలో ఆర్తి గార్డెన్లో భారస ఆవిర్భావ దినో త్సవ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి నిష్పక్షపాత ధోర ణి అవలంభిస్తూ పేద మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది అని చెప్పారు. తాండలను గ్రామ పంచాయితులుగా చేసి గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికేల చేసారని, స్వయం పరిపాలన అందుబాటుకోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక అద్భుతమైన కలెక్టర్ కార్యాలయం, పరిపాలన సులభ తరం అయ్యేలా చేసి ప్రజలకు ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ తిరిగే కాలానికి స్వస్తి పలికారని చెప్పారు. అన్నదాతలకు అండగా నిలుస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దండగ అన్న వ్యవసాయాన్ని పండగల చేశారని చెప్పారు. మానుకోట లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నిన్న హైదరాబాద్‌కి అమిత్ షా వచ్చి ఎమీ చేశాడు, వచ్చి రాణి భాషలో కేసీఆర్ వారి కుటుంబసభ్యు లను ఉదేశించి కుట్రపూరితంగా విమర్శలు చేయడం తప్ప, మన తెలంగాణకి చేసింది ఏమి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ స్థాయిలో వివిధ అంశాల్లో దాదాపుగా 2.5 లక్షల గ్రామాలు 46 విభాగాల్లో పోటీపడగ మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను 13 అవార్డులు వరించిన విషయాన్ని గుర్తు చే సి, కేంద్ర ప్రభుత్వం అంధత్వంతో బాధపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజ్ ప్రారంభమై 150 మంది వైద్య విద్యా ర్థులతో తరగతులు ప్రారంభమవడం ఎంతో సంతోషంగా గర్వంగాఉందని చెప్పా రు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆంగోతి బిందు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు మర్నేని వెంకన్న భరత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాం మోహన్ రెడ్డి, జిల్లా రైతు కో ఆర్డినెటర్ బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మహాబూబ్ పాషా, పట్టణ అధ్యక్షులు గద్దె రవి, యువజన నాయ కులు యల్లా మురళీధర్ రెడ్డి, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.