Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని పోచారం-బాలాజీతండ పరిసర ప్రాంతాలలో విద్యుత్ మర మ్మత్తులు చేస్తూ మృతి చెందిన ఒప్పంద కార్మికుడు వాంకుడోత్ ఉపేందర్ కుటుం బానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కుటుంబసభ్యులు, బంధువులు,అఖిలపక్ష నాయ కులు డిమాండ్ చేశారు. ఉపేందర్ మృతదేహంతో మంగళవారం సబ్‌స్టేషను ఎ దుట ప్రధాన రహదారి పై బైటాయించి సుమారుగా 5 గంటల పాటు అందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు వచ్చి ఉపేందర్ కుటుంబానికి యాబై లక్షల రూ పాయలు ఎక్స్‌గ్రేషియాతో పాటు,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం,డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అందోళనకారులు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ ఎస్ఈ జె.నరేష్, డిఈ విజరులు అందోళనకారులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో చర్చించి శాఖ పరంగా 5లక్షలు, ఇన్సూరెన్స్ 10, ఇపిఎఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షలు, డబుల్ బెడ్ రూం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే హమి ఇవ్వడంతో అందో ళన విరమించారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా గార్ల-బయ్యారం సిఐ బాలాజీ, గార్ల, బయ్యారం ఎస్సైలు బానోత్ వెంకన్న, రమాదేవిలు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈ అందోళనలో సర్పంచ్ ఎన్.జ్యోతి, ఎంపిటీసి డి.రాజకు మారి, అఖిలపక్షం నాయకులు కె.శ్రీనివాస్, డి.రామారావు, కె.శ్రీనివాస్, యం. వెంకట్‌లాల్, బి.హరి, యం.గిరి, బి.నాగేశ్వరావు, జె.సత్యనారాయణ, గ్రామస్థులు ఎన్.నరసింహ, వి.వెంకటేశ్వర్లు, ఆర్.లలితమ్మ,ఉపేందర్ రెడ్డి, ఎల్లయ్య, సితారం, బాల, లక్ష్మారెడ్డి, ఉమేష్, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.