Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
అకాల వర్షంతో నష్టపోయిన రై తులను ఆదుకోవాలని, వారికి తగిన నష్టపరి హారం చెల్లించాలని డిమాం డ్ చేస్తూ రైతులతో కలిసి మాజీ శాసన సభ్యులు, పిసిసి సభ్యులు కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి మంగళవారం వడ్లకొండలో మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. రెండు మూడు రోజులుగా జనగా మ మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి వరి, మామిడి తోటలకు విపరీతమైన నష్టం జరిగింది. సోమవారం రాత్రి కురిసిన వడగండ్లకు వెంకిర్యాల, గానుగుపహాడ్, అడవికేశ్వాపూర్ గ్రామాల్లో విపరీతమైన పంట నష్టం వాటిల్లింది. వెంకిర్యాల గ్రామంలో గింజ లేకుండా వరి పంట నేల రాలింది. మేక లు, జీవాలు రాళ్ల వానకు మృతి చెందాయి.బాధితులు లబోదిబోమంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కొమ్మూరి డిమాండ్ చేశారు. వెంకిర్యాలలో కీర్తి శ్రీనుకు చెందిన గొర్రెలు, మేకలు పిడుగు పాటుకు గురై చనిపోయినందున వాటికి నష్టపరిహారం ఇప్పించాలని పశు సంవ ర్ధక శాఖ జె.డి. మనోహర్‌రావు, ఎడి నర్సింహాలను ఆయన కోరారు.ఈ కార్యక్ర మంలో చీటాకో డూర్ పిఎసిఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జిల్లేల సిద్దారెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షు లు మోటు శ్రీనివాస్, జాయ మల్లేశ్, నర్సిరెడ్డి, దాసరి శేఖర్, నాగంపల్లి శ్రీనివాస్, రాగుల శ్రీనివాస్, హర్షద్, దాసరి క్రాంతి పాల్గొన్నారు.