Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
కొనుగోలు తీసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లుకు తరలించాలని జనగామ అడిషనల్ కలె క్టర్ ప్రపుల్ దేశారు అ న్నారు. మంగళవారం నర్మెట్ట మండలంలోని హన్మంతపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సంద ర్శించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నావి కావున రైతులు కోసిన ధాన్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. గ్రామ వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇవ్వాలని సూచించారు.ఈకార్యక్రమంలో డీసిఎస్ఓ రోజా రాణి, డీఏం సంధ్యారాణి, ఎంపిడివో ఖాజా మొహునుద్దీన్, సీసీలు యాదగిరి, కవిత, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.