Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
అకాల వడగళ్ల వర్షాలతో అన్న దాతలు ఆగమాగమై ఆందోళన చెం దుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలన్నీ నేలపాలయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వడగళ్ల వానల కు వరి పంటలు, మామిడితోటలు నేలరాలాయి. మండలంలోని మంతోనిగూ డెం, కళ్లెం, మాణిక్యపురం లింగాల గణపురం గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికా రి వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అంజయ్య బృందం పంట నష్టంకు సంబందించి వరి పంటలను పరిశీలించడం జరిగినది. 500 ఎకరాలలో వడ్లు రాలినట్లుగా గుర్తించ డం జరిగింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.