Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ- ములుగు
ప్రజా సంక్షేమ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప మని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్ లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజక వర్గస్థాయి ప్లీనరీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి పులా మలవేసి నివా ళులర్పించి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు కేంద్ర వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత గిరిజనులకు ఒక స్వర్ణ యుగమని అన్నారు. ఇక్కడ గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ప్రాంత అభివృద్ధికి తట్టెడు మట్టైనా పోయించారా అని అన్నారు. విమ ర్శించాలనే పనిగట్టుకుని మాట్లాడే వాళ్లకు ఛత్తీస్‌ఘడ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. కేసీఆర్‌ని విమర్శించే స న్నాసులు రాష్ట్రంలోని అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమల వుతున్నాయా అని ప్రశ్నించారు. త్వరలో ములుగు జిల్లాలో 3వేలమందికి ఒక్కొక్కరిక గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షలు అందిస్తామని, త్వరలో ములుగు జిల్లాలో 1100 మందికి దళిత బంధు అందజేస్తా మని అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లిన అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కెసిఆర్‌కు జేజేలు పలుకుతున్నా రన్నారు. కాంగ్రెస్, బిజెపిలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమ న్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి,కుల వృత్తులకు అనేక వినూత్న పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 2,471 గిరిజన తండాలను, ఆదివాసీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన ఆదివాసి బిడ్డల కల సాకారం చేశారన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.600 కోట్లు మంజూరుచేశారన్నారు. గిరిజన అవాసాలకు బీటి రోడ్లను మంజూరు చేశారనీ,ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తో పాటు ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపుతు న్నామన్నారు. కెసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, ఆత్మీయ సమ్మేళన పరిశీలకులు అరికెల నర్సారెడ్డి, గ్రథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందునాయక్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడేనాగ జ్యోతి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అన్ని మండలాల అధ్యక్షులు బాదం ప్రవీణ్, రమణారెడ్డి, సాయికుమార్, మల్లయ్య, సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, కుడుముల లక్ష్మీనారాయణ, వేణు యాదవ్, యర్ప సూరయ్య, సీనియర్ నాయకులు మల్క రమేష్, మల్లారెడ్డి, మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.