Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
రైతు రాజ్య స్థాపనే బీఆర్ఎస్ లక్ష్యమని కార్య కర్తలే పార్టీకి బలం, బలగం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంజూరునగర్ ఏఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించగా జిల్లా ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈడీ,సీబీఐ లకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తప్ప, బిజెపి బడా వ్యాపారాలు, ప్రజాప్రతినిధులు దర్యాప్తు సంస్థలకు కనబడడం లేదా అని మండిపడ్డారు. మోడీ తెలం గాణ ప్రజా ప్రతినిధులను భయాందోళనకు గురి చేస్తూ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఈడి దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రం దేశా నికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ రెండు దఫాలు గెలిచి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూని వర్సిటీ లాంటివి విస్మరించాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబె డుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి ఎంతోమంది రైతుల చావుకు కారణం మోడీ అ య్యాడని అన్నారు. తెలంగాణలో పండించిన ధాన్యా న్ని కొనలేని కక్షపూరిత ధోరణి కేంద్రం అవలం భిస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల పక్షపాతిగా కేసీఆర్ నిలిచాడని అన్నారు. దేశంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి మోడీ ఓర్వలేకనే బిజెపి నాయకులు అవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపద్దారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్, కేసీఆర్ కీలకం కానున్నారని అన్నారు. బీఆర్ఎస తెలంగాణలో హ్యాట్రిక్ సాధించే విధంగా కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అనేక సంక్షేమ ప థకాలు అభివృద్ధి తదితరవాటిపై ప్రతినిధుల సభలో తీర్మానాలు చేపట్టి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సాంబారావు , జెడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, పార్టీ పట్టణ రూరల్ అధ్యక్షులు కటకం జనార్ధన్, పిన్ రెడ్డి రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు ఇంగే మహేందర్, జెడ్పిటిసిలు గొర్రె సాగర్, జోరుకసదయ్య, సాయిని విజయ ముత్యం, పులి తిరుపతిరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, అన్ని మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.