Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
గణపురం మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై జెండా ఆవి ష్కరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేషృఆర్ టిఆర్ఎస్ స్థాపించి రెండు పర్యా యాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా నామకరణం చేశాడన్నారు. ప్రస్తు తం దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు ముం దడుగు వేశారన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు జెండావిష్కరించారు. సర్పం చుల ఫోరం మండల అధ్యక్షుడు పొట్ల నగేష్, సర్పంచులు నారగాని దేవేందర్‌గౌడ్, నడిపెల్లి మధు సూదన్‌రావు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పొలు సాని లక్ష్మీనరసింహా రావు, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ శివశంకర్‌గౌడ్, రమాదేవి మధుకర్, మంద అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ పోతర్ల అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రం తిరుపతిగౌడ్ పాల్గొన్నారు
మల్హర్రావు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం మండలం లోని మల్లారం,తాడిచెర్ల, కొయ్యుర్ గ్రామలతోపాటు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం మంథనిలో నిర్వహిం చిన ప్రజాప్రతినిధుల సభకు తరలివెళ్లారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, కాళేశ్వరం డైరెక్టర్ బండి రాజయ్య,ఎంపిటిసి రావుల కల్పన మొగిలి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, లింగన్నపేట శ్రీనాథ్, రాజు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ మండల అధ్య క్షులు తోట జనార్దన్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర నాయకులు కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు తోట జనార్ధన్, జక్కు రాకేష్, సర్పంచులు తోట రాధమ్మ, మండల అధ్యక్షురాలు ఏనుబాక సుజాత, రాజమౌళి, ఆర్జయ్య, వెంకటస్వామి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్ : మహాదేవపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ రావు సమక్షంలో పార్టీ మహాదేవపూర్ పట్టణ అధ్య క్షులు కూరతోట రాకేష్ గులాబీ జెండా ఎగురవే శారు. పార్టీ ప్రజా ప్రతినిదులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కోల్‌బెల్ట్ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిది పదో వార్డులో వార్డు కౌన్సిలర్ బద్ది సమ్మయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 23వ ప్లీనరీ సందర్భంగా మంగళవారం వార్డు అధ్యక్షులు తరిగొప్పుల రామారావు జెండావిష్కరించారు. అనంతరం సమ్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సహకారాలతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. రాబోయే ఎన్నికలలో రమణారెడ్డిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలి పారు. నాయకులు అయిత తిరుపతి, పీఏసీఎస్ డైరెక్టర్ బానోత్ సమ్మయ్యనాయక్, యూత్ అధ్యక్షులు ఎన్ విష్ణురావు, ఎస్ వెంకట్రావు, వార్డు నాయకులు మలహల్రావు, సంపత్‌రావు, పురుషోత్తంరావు, నారాయణరావు, రవిందర్‌రావు, మొగిలి, మల్లయ్య, రఘు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురపనేని సాయి కుమార్ ఆధ్వర్యంలో చల్వాయి గ్రామంలో సర్పంచ్ వీసం సమ్మయ్యతో గ్రామ కమిటీ అధ్యక్షుడు నాం పూర్ణచందర్, లక్ష్మీపూర్ గ్రామంలో చుక్క గట్టయ్య తో కలిసి గ్రామ కమిటీ అధ్యక్షుడు జల్లెల్ల కొమురయ్య మండల కేంద్రంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకినపల్లి రమేష్, దుంపల్లిగూడెంలో బండి రాజశేఖర్, పస్రాలో తాటికొండ శ్రీను బీఆర్ఎస్ జెం డాలను ఆవిష్కరించారు. అనంతరం ములుగు లో జరిగే సమావేశానికి భారీగా తరలి వెళ్లారు.
తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలో గులాబీ జెండాను పార్టీ అధ్యక్షులు దండుల మల్లయ్య ఎగురవేశారు. గ్రామ గ్రామాన వాడవాడల పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఇన్చార్జిల పర్యవేక్షణలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ములుగు జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, మండల అధ్య క్షులు దండుగుల మల్లయ్య, మాజీ మండల అధ్య క్షులు దిడ్డి మోహన్‌రావు, బండారి చంద్రయ్య, ముం డ్రాతి రాజశ్రీ, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, నాయకులు చల్ల రజనీకర్‌రెడ్డి, వహీద్, కాక లింగయ్య, ప్రజా ప్రతినిధులు, మండల శ్రేణులు, ఇన్చార్జిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : బీఆర్ఎస్ పార్టీ జండా పండుగను మండలంలోని 25 గ్రామపంచాయతీలలో నాయకులు పండుగ వాతావరణంలో జరుపు కున్నారు. ఆయా గ్రామాల్లో ఇన్చార్జి నాయకులు బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, సీనీయర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, తోట రమేష్, పోలిన హరిబాబు, బాడిశ నాగ రమేష్, గుండేటి రాజుయాదవ్, కాడబోయిన నరేందర్, నర్రా శ్రీధర్, సిద్ధంశెట్టి వైకుంఠం, శానం నరేందర్, అనురాధ, ఆఫ్జల్, కొమరగిరి కోదండం, చిట్టీమల్ల సమ్మయ్య, లోడంగి లింగయ్య, హనుమంతరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, బుట్టో, అయూబ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.
రేగొండ : బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం రేగొండ మండల కేంద్రంలో గులాబీ జెండాను ఆ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ ఎగరవేశారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై మాట్లాడారు. జగ్గయ్యపేటలో అమ్ముల రాజయ్య, గోరుకొత్తపల్లిలో రఘ సాల తిరుపతిరావు పార్టీ జెండా ఎగరవేశారు. ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జడ్పిటిసి సాయిని విజయ, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, వైస్ ఎంపీపీ కుందూరు ఉమారాణి విద్యాసాగర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్రావు, జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్‌గౌడ్, సంతోష్, సంతోష్, పాపిరెడ్డి, బిక్షపతి, సర్పంచులు ఎంపీటీసీ లు, నాయకులు రాజు, సదానందం, విష్ణుయాదవ్, అశోక్‌రెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.