Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొల్లికుంటలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
వతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ నిర్లక్ష్యం వహిస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యద ర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఖిల్షా వరంగల్ మండలం బొల్లికుంటలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దండు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తక్కళ్లప ల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తున్నదని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని అన్నారు. తెలంగాణకు రావలసిన నిధుల ను, ప్రాజెక్టు లను కేంద్రం అడ్డుకుంటున్నదన్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చ లేదని అన్నారు. విదేశాల్లో దాచుకున్న అ వినీతి సొమ్మును రాబట్టి ప్రతీ పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రి స్తామని, ఏటా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు.రాష్ట్రంలో బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు పాదయాత్రలు చేపడుతున్నారని అన్నారు. బిజెపి పా లనలో పేదలు మరింత పేదలుగా ధనవంతులు మరింత ధనవంతులు గాని మా రిపోయారని, దేశ సంపదను మోడీ కార్పొరేట్ శక్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్ర జలపై అధిక భారాలు మోపుతున్న బిజెపి నాయకులకు తెలంగాణలో తిరిగే హ క్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా సీపీఐ కార్యదర్శి మేకల రవి, షేక్ బాష్ మియా, జిల్లా కార్యవర్గ సభ్యులు గన్నారపు రమేష్, గుండె బద్రి, సంగీ ఎలేంధర్, జన్ను రవి, పరికిరాల రమేష్, ల్యాదెళ్ల శరత్, టి. రహేలా మస్క సుధీర్ సౌందర్య ,జోసెఫ్,ఎన్ కుమార్, చిట్యాల సువర్ణ తదితరులు పాల్గొన్నారు.