Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ
నవతెలంగాణ-మట్టెవాడ
వైద్య , మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా పనిచేసి వరంగల్ జిల్లా ను మలేరి యా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా క్టర్ కాజీపేట వెంకటరమణ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్క రించుకొని మంగళవారం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ఆర్ తోట పట్టణ పీహెచ్సీలో కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా మహిళలచే పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్వో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమిష్టి కషితో దోమలను నివారిస్తే మలేరియా నివారణ అవుతుం దన్నారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్లు మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపుమేరకు నూతన ఆవిష్కరణలతో 2030 సంవవత్సరం వరకు భారతదేశాన్ని జీరో మలేరియా దిశగా తీసుకుపోయే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి నాగ య్య, బయాలజిస్ట్ మాధవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ, స్థానిక వైద్యాధి కారి డాక్టర్ అనిత, డిప్యూటీ డెమో అనిల్ కుమార్,ఇన్చార్జి ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, హెచ్ఈవోలు అజరు, సోమయ్య, సూపర్వైజర్లు పాలకుర్తి సదానం దం, మధుకర్, హెల్త్ అసిస్టెంట్లు, సీఈవో మోహన్ రావు, స్థానిక వైద్య, మున్సిప ల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.