Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
జిల్లాలో స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలని కోరుతూ ఉపాద్యాయులు హ నుమకొండలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట శాంతియుత ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర స్పౌజ్ ఫోరం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల్లోను ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పౌజ్ ఉపాద్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. తొలుత ఉపాద్యాయ, ఉపాధ్యాయినీలు డీఈవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో కందగట్ల సురేష్, వేణుగోపాల్, నేదునూరి శ్రీహరి, శ్రీనివాసస్వామి, హేమలత, గౌసియా, శరత్, రాంగోపాల్ రెడ్డి, హుస్సేన్ తదిత రులతో పాటు 150 మంది పాల్గొన్నారు.