Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఎండలు ముదరడం తో పాటు ఆకస్మిక వర్షాల వల్ల వ యోవృద్ధులు అనారోగ్యం పా లవుతున్నారని వయోవృ ద్ధుల కు తగు సూచనలతో పాటు వై ద్యసేవలు అందించాలని కోరు తూ మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వైద్య అధికారి డాక్టర్ సాంబశివరావును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కలిసి వినతి ప త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వయోవద్ధులు ఎండవేడికి గురికాకుండా తగు సూచ నలను జాగ్రత్తలు అందించడంతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచి తంగా మందులు అందించాలని అన్నారు. వాంతులు, మోషన్స్ అయితే ఓఆర్ ఎస్, మందులను పట్టణ ప్రాథమిక కేంద్రాల ద్వారా ముందుగానే వయోవద్ధులకు అందించాలని కోరారు. వేసవిలో వచ్చే రోగాలపై గోడలపై, కరపత్రాలపై అవగా హన కల్పిస్తూ వయోవృద్ధులు, గర్భిణీలు, పిల్లలకు చైతన్యం కలిగించాలని కోరా రు. వయోవద్ధులు వేసవిలో బయటికి వెళ్లేటప్పుడు స్వయంగా కొన్ని జాగ్రత్తలు తీ సుకోవాలని తప్పని పరిస్థితుల్లో ఎండకు బయటికి వెళ్తే గొడుగులు తీసుకువెళ్లా లని, కాటన్ దుస్తులు ధరించాలని తలకు రుమాలు చుట్టుకోవాలని, ఏదైనా సమ స్య ఉంటే 14567 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని వయోవద్ధుల వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు వయోవద్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తేరాల యుగేందర్, కార్యదర్శి కోన్రెడ్డి మల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ రాజేం ద్రప్రసాద్, పిట్టల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.