Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ ఎకరాకు గోదావరమ్మ పరుగులు
- అసాధ్యమన్నదానిని.. సుసాధ్యం చేసి చూపించాం
- బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేధించి కేసీఆర్‌కు అండగా ఉండాలి
- రూ. 2 కోట్లతో కార్యకర్తల భరోసా నిధి
- బీఆర్ఎస్ ప్లీనరీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పుల ను సాధించి ప్రతీఎకరాకు గోదావరమ్మ పరుగులు పట్టించామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం వ్యవసాయ గ్రేన్ మార్కెట్ లో నిర్వ హించిన బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ప్లీనరీ లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనేక త్యా గాల ఫలితంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో సాధించు కున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుస లో నిలిచిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివద్ధి చేసి నిరూపించామన్నారు. తాను రూపొందించిన ఇ రిగేషన్ సర్క్యూట్ వెంట గోదావరమ్మ పరుగులు పె ట్టిందన్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు పాఖాలకు గో దావరి జలాలు సాధ్యంకాదని చాలెంజ్ చేశాడని. ఈ నాలుగేండ్లలోనే సుసాధ్యం చేసి రైతుల పాదాలు కడి గామన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా 300ల పైచిలుకు చెరువులను నింపామని తెలిపా రు. దాని ఫలితమే నేడు యాసంగిలో 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైందన్నారు. నాడు కాల్వలు తవ్వి కాంట్రాక్టుల పేరిట కోట్లు దండుకున్న చరిత్ర వారిదైతే మాది ప్రతి ఎకరాకు రెండు పంటల కు సాగునీటిని అందించిన ఘనత మాది అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మాధన్నపేట మినీ ట్యాంక్ బండ్ మంజూరు తీసుకొస్తే ఎమ్మెల్యే గా అనై తికంగా కాంట్రాక్టు దక్కించుకొని పనులు చేయకుం డా అభివృద్ధిని అడ్డుకొన్నాడని విమర్శించారు. చెరు వులో 'హైవే' వారు తవ్విన గోతులను చూపించి పూ డిక తీసినట్టు అడ్డదారిలో రికార్డులు సష్టించి రూ. కో ట్లబిల్లులు కాజేసిన ఘనుడని ఆరోపించారు. త్వరలో నేమిగిలిపోయిన మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేస్తామన్నారు. విద్యా,వైద్య రంగాల్లోనూ మునుపె న్నడూ లేని పురోగతిని సాధించగలిగామన్నారు. 25 0 పడకల ఆసుపత్రి శరవేగంగా నిర్మాణం సాగుతోం దని, పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా,సబ్ సెంటర్లను ప్రారంభించి అందుబాటులో మెరుగైన వైద్యం అందించ బోతున్నా మన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకులాలు, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యా అవకా శాలను కల్పించామన్నారు. టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 26రకాల వైద్య పరీక్షలు మరో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోందన్నారు. ఇక సంక్షేమ రంగంలోనూ ముందువరుసలో నిలిచా మని, 1000 ట్రాక్టర్లు, 7వేల పైచిలుకు సబ్సిడీ మో టార్లు ప్రత్యేకంగా రైతులకు పంపిణీ చేశామని గుర్తు చేశా రు. త్వరలోనే 10వేల మందికి పీవీసీ పైపులు సబ్సిడ పౖీె ఇస్తామన్నారు. ప్రభుత్వం రైతులకు ముందుస్తు పెట్టుబడి తో పాటు అకాల వర్షాలతో ఆపదలో ఉన్న రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకున్నామని తె లిపారు. ఇటివల సీఎం కేసీఆర్ స్వయాన దెబ్బతిన్న పంటలను సందర్శించి రైతులను ఓదార్చారన్నారు. త్వరలోనే 36 వేల మంది రైతులకు రూ.38కోట్లను ప్రత్యేక ప్యాకేజీ ద్వారాప్రభుత్వం నష్టపరిహారం అంద జేనుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.60కో ట్ల పైగా అందజేశామన్నారు. దళితులకు పైలెట్ ప్రా జెక్టు కింద 10వేల యూనిట్ల పాడిగే దెలను పంప ిణీ చేశామన్నారు. ఉపాధిహామీ పథకం తీసేందుకు కుట్రలు పన్నుతోందని, 30వేల కోట్ల నిధులను తగ్గిం చి కూలీలకు పనిదినాలకు దించేసిం దన్నారు. ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధా నం చేయా లని సీఎం కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
నల్ల చట్టాలను వెనక్కి తీసుకొన్నట్టే తీసుకొని అప్రకటితంగా అమలు చేస్తుందని దుయ్యబట్టారు. రైతుల మోటర్లు కు మీటర్లు పెట్టేందుకు కుట్రలు ప న్ను తోందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల ను నిండా ముంచుతుందన్నారు. దేశాన్ని ఆదానీ, అంబానీ లకు కట్టబెట్టడానికి రైతులను వ్యవసాయా నికి దూరం చేస్తుందని అన్నారు. దీన్ని వ్యతిరేకించు తూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ బీఆర్ఎస్ ను విస్తరిం చేందుకు సంకల్పించారని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో అనూహ్య స్పందన వస్తుందన్నారు.బీజేపీకి వ్యతిరేకం గా సాగేపోరాటంలో ఈ నియోజకవర్గ ప్రజలు అండ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల ఇక్కడ మొదలైన ఉత్తర యుద్దం స్పూర్తి తో ఈనెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రగులు కుంటుందన్నారు. ఉపాధిహామీ పథకం వ్యవసాయా నికి అనుసంధానం చేయాలనే డిమాండ్ బలంగా వి న్నించి కేంద్రం దిగివచ్చే వరకు బీఆర్ఎస్ ఉద్యమించ నుందన్నారు.
రూ.2 కోట్ల తో కార్యకర్తల భరోసా నిధి
నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలను ఆపదలో ఆదుకునేందుకు రూ.2కోట్లతో భరోసానిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఇందుకోసం తన ఏప్రిల్ నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్లీనరీలో 16 తీర్మానాలు ఆమోదం..
బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో 16 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వివిధ మండలాల ముఖ్య నాయకులు తీర్మానాలను ప్రవేశపెట్టగా కార్యకర్తల చప్పట్లతో ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రా మస్వామినాయక్, బీఆర్ఎస్ నాయకులు రాయిడి ర వీందర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యా సాగర్ రెడ్డి, డాక్టర్ గుండాల మధన్ కుమార్, నీల శ్రీధర్ రావు, బీరం సంజీవరెడ్డి, భానోతు సంగులాల్, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, వేములపల్లి ప్రకాష్ రా వు, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, గుంటి కిషన్, బుర్రి తిరుపతి, కొమ్ము రమేష్ యాదవ్, ఎంపీపీలు జాటోత్ రమేష్, ఊడ్గుల సునీత ప్రవీణ్, బాధావత్ విజేందర్, మోతె కలమ్మ, జెడ్పీటీసీలు పెద్ది స్వప్న, ప త్రినాయక్, బత్తిని సునీత శ్రీనివాస్ , సర్పంచ్ ల ఫో రం అధ్యక్షులు కొడారి రవి, క్లస్టర్ ఇన్చార్జి లు దార్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.