Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-కాజీపేట
హమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వలే సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 29న హైదరాబాద్ లోని రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందూ జరిగే ధర్నాలో హామాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి,సిఐటియు జిల్లా రా గుల రమేష్ అన్నారు.మంగళవారం మడికొండలో చలో హైదరాబాద్ పోస్టర్లు కరపత్రాలను ఆయన ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ హామాలీలకు 50 కేజిలకు మించిన బరువును నిషేధించాలని , పని గంటలు, భద్రత, గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్ఐ సౌక ర్యం, పెన్సన్ వంటి చట్ట బద్ద హక్కులు కల్పించాలన్నారు, ఐకెపి హమాలీలకు ప్ర భుత్వమే బిల్లులు చెల్లించాలని ప్రమాద, ఆరోగ్య భీమా కల్పించాలన్నారు. ప్రభు త్వ గోదాంలో పనిచేసే హమాలీలను 4వ తరగతి ఉద్యోగులు గా గుర్తించి, ఇండ్లు స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మంచాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షలు మంది వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలలో హామాలీ లు పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారని, హమాలీల సంక్షే మం కొరకు పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. 50 కేజీలు మించి హ మాలీలతో బరువులు మోయావద్దని ఐఎల్వో తీర్మానం చేసినప్పటికీ అదిక బరువు లు మోయించటంతో హమాలీలు అనారోగ్యాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారన్నారు. ప్రభుత్వ గోదాములలో పనిచేస్తున్న ఎఫ్‌సీఐ, బేవరేజెస్, ఎలక్ట్రిసి టీ, స్టోర్ మార్కెట్లు, సివిల్ సప్లై గోదాములలో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు రాజేందర్, ధనంజయ, శ్రీనివాస్, మొగిలి, సతీష్, లింగమూర్తి, వెంకన్న, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.