Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైతు సంఘం నాయకులు
- పోలీస్ అధికారుల చర్యలు ఏమైనట్టు..!
నవతెలంగాణ-వరంగల్
అనేకమంది వ్యాపారస్తులు, రైతులు, ప్రజాప్రతి నిధులు ముందుకు వచ్చి సంఘ కార్యాలయ స్థలం భ వన నిర్మాణానికి కావలసిన విరాళాలు అందించగా 2015-16లో వరంగల్ నగరంలోని అబ్బనికుంట పరిధిలో రిజిస్టర్ అయినదాదాపు 350 గజాల స్థలా న్ని కొనుగోలు చేసి నిర్మించిన జీప్లస్వన్ భవనం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిందని దానిని కబ్జాదారుల కబంధ హస్తాల నుండి కాపాడాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.
ఈ భవనాన్ని ఆనాటి తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఓ నాయకుడు తన సమీప బంధువు పేరున 2019న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తప్పుడు పత్రాలను సమర్పించి తె లంగాణ రైతుసంఘంలో ఏలాంటి తీర్మానం లేకుం డా విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారానే ఆరోపణలు విన వచ్చాయి. ఈ విషయం కమిటీ సభ్యులకు తెలిసి సం బంధిత కార్యాలయం వరంగల్ మున్సిపల్ కార్పొరే షన్ కార్యాలయం నందు ఆస్తి మార్పిడి చేయకూడ దని, అదేవిధంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఫిర్యా దు చేయగా విధులేని పరిస్థితిలో దాదాపు 6 నెలల తర్వాత ఇట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవడం జరిగిం దని సమాచారం. తెలంగాణ రైతు సంఘం పాలక వర్గంలో ఆనాటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓ వ్యక్తి సంఘ బైలాకు విరుద్ధంగా కమిటీకి తెలియకుండా చేస్తున్న తప్పుడు విధానాలను కమిటీ చర్చించి తెలం గాణ రైతు సంఘంలోని తనకున్న అన్ని బాధ్యతలు నుండి తొలగిస్తూ సంఘ పాలకవర్గం తీర్మానించి ఏకగ్రీవంగా ఆమోదించి, సదరు వ్యక్తిని తొలగిం చిన తర్వాత సంఘ పాల కవర్గంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను తన బంధువులను సంఘ కార్యవర్గంలో చేర్పించి, వరంగల్ సంఘాల రిజి స్ట్రేషన్ అధికారిపై ఆ వ్యక్తి తన పలుకుబడిని ఉప యోగించి సంఘంలో సభ్యులు కానటువంటి 13 మందిని సంఘ బైలాకు విరుద్ధంగా చేర్పించి, సంఘ ఆస్తి కాజేయుటకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సంఘ పాలకవర్గంలో చేర్పిం చిన 13 మందిపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా వీరిపై కేసులు కూడా నమోదు అయి నట్టు తెలుస్తోంది.
పోలీసు అధికారులు మాటలు బేఖాతర్..!
తెలంగాణ రైతు సంఘం భవనాన్ని గతంలో ఉ న్న సంఘం నాయకుడు కబ్జాకు గురి చేసాడని ఇ టీ వల పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చి సదరు అధికారిని రైతులు సంప్రదించగా విచారణ చేసి వెం టనే రైతు సంఘం భవనం నుండి కబ్జాదారుడిని ఖాళీ చేయాలని ఆదేశించినప్పటికి ఇప్పటికీ సుమారు గా నాలుగు నెలలు అయినప్పటికీ ఇంతవరకు కాలి చేయకపోవడం శోచనీయమని పలువురు అనుకుం టున్నారు. పోలీస్ అధికారుల మాటలు కూడా బేఖా తర్ చేస్తున్నారని కూడా పలువురు చర్చించుకుం టు న్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినప్పటికీ ఈ తంతు ఇలాగే కొనసాగడం గమ నార్హం. ఏది ఏమైనప్పటికి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
బ్లాక్మెయిల్ విధానాన్ని మార్చుకోవాలి : సోమిరెడ్డి శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షుడు
రైతు కూలీ సంఘం భవనం కబ్జాకు గురిచేసిన ఒక వ్యక్తి భయభ్రాం తులకు గురి చేస్తున్నా డు. తరచుగా తనకు సంబంధించిన ఫ్లాట్లు తనకు కాకుండా చేస్తా నని బెదిరింపు ధోరణి లలో మధ్య వర్తుల ద్వారా బెదిరిస్తు న్నా రు. ఒక వేళ తాను పెట్టిన కేసును విరమిం చుకోకుంటే అక్రమంగా తనపై కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.