Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూర్‌నాగారం ఐటిడిఏ
డ్క్రెమిక్స్ యూనిట్లో జోహర్ మిల్, స్వీట్ మిల్ పదార్థాలు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని ఇవ్వాలని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డ్క్రెమిక్స్ యూనిట్‌ను సందర్శించి స్వయం కషి సభ్యులతో ఆయన మాట్లాడారు. స్యామ్ మ్యామ్ న్యూట్రిషన్ కిట్ల ప్యాకింగ్ ప్రక్రియ యొక్క తయారీని పరిశీలించారు. న్యూట్రిషన్ కిట్ల కోసం ఉపయోగించే పదార్థాలు, న్యూట్రిషన్ కిట్ల తయారీకి అందుబాటులో ఉన్న ముడిసరుకులపై స్వయం కషి జేఎల్‌జీ గ్రూప్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. యంత్రాల లభ్యత, పనితీరు ఎలా ఉందని ఆరా తీశారు. నిబంధనలు పాటి స్తూ తయారు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ లేదన్నారు. అనంతరం గురుకులం బాలికల రెసిడెన్షి యల్ డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది ఎంతమంది అందుబాటులో ఉన్నారని, క్రమం తప్పకుండా హాజరవుతున్నారా లేదా ఏటూరునాగా రంలో ఉంటున్నారా అని ఇంచార్జి ప్రిన్సిపాల్ మౌనిక ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు రిజి ష్టర్ పరిశీలించి, విద్యార్థుల కొరతపై ఆరా తీయగా ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. కొంతమంది విద్యార్థులు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్‌లో ఉన్నారని, మరికొంత మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యల కారణంగా హాజరు కావడం లేదని ఆమె పీఓకు వివరించారు. సాధారణ పరీక్షలు దగ్గరలో ఉన్నాయని, తరగతులకు హాజరు కావాల్సిందిగా ప్రిన్సిపాల్‌ని పీఓ ఆదేశించారు. రాత్రి బస చేసిన సిబ్బంది వివరాలను ఆరా తీశారు. దీనికి సంబంధించి రిజిస్టర్ నిర్వహణను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎదైనా సమస్యలుంటే వెంటనే నా దష్టికి తీసుకురావలన్నారు. కళాశాల ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆరా తీశారు. విద్యార్థుల కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. బోటోనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్‌లను తనిఖీ చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, క్రీడా పాఠశాలలోని సమ్మర్ క్యాంప్ 2023 మెరుపులు కార్యక్రమాన్ని పరిశీలించారు. వేసవి శిబిరం కార్యక్రమాలకు హాజరయ్యే సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడి నుంచి హాజరవుతున్న సిబ్బందిపై ప్రిన్సిపాల్ టివి రాజును అడిగి తెలుసు కున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహబూ బాబాద్ జిల్లా బయ్యారంలోని గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన గురుకులం నుంచి విద్యార్థులు హాజరయ్యారని, శిబిరం ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు నడుస్తుందని తెలిపారు. కంప్యూటర్, డ్యాన్స్, లైఫ్ స్కీల్స్, ఇతర శిక్షణ ఇచ్చే వారితో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మెనూ పాటించాలన్నారు. కమ్యూనికేషన్, నాయకత్వ సజనాత్మక, సహకార నైపుణ్యాలను మెరుగుపరచడానికి దష్టి పెట్టాలన్నారు.