Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఎన్సీఎల్టీ కోర్టు తీర్పులో రిసొల్యూషన్ ప్రొఫెషన్ కు 69 కోట్లు కార్మికులకు 6 కోట్లు ఇ వ్వాలంటూ ఇచ్చిన తీర్పును నిర సిస్తూ ఏపీఆర్ ఆదర్శ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బిల్ట్ కార్మికులు మంగళవారం కంపెనీ ప్రధాన గేటు ముందు ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్బంగా కార్మిక నాయకులు, కార్మికులు మాట్లాడుతూ కంపె నీలోని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని రావల్సిసిన బకాయిలు చెల్లిం చాలంటూ ఎన్సీఎల్టీ కోర్టుకు వెల్లినట్లు తెలిపారు. ఇటీవల వెలువడిని ఎన్సీఎల్టీ తీర్పులో రీసొల్యూషన్ ప్రొఫెషన్ కు 69 కోట్లు, కార్మికులకు కేవలం 6 కోట్లు చెల్లించాలని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. బిల్ట్ కార్మి కులకు పెండింగ్ 46 నెలల పీఎఫ్ బకాయిలు, 52 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్ట్ కాలనీలోని కార్మికుల నివాసాలకు విద్యుత్ సరఫరా పురు ద్దరించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ కార్మికులకు ఫుల్ సెటిల్మెంట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 327 కోట్లు కార్మికులకిచ్చి ఆదుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బిల్ట్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా బిల్ట్ కార్మికులను కార్మిక కుటుంబాలను ఓటు బ్యాంకుగా చూడకుండా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్కే కుర్బాన్ అలీ, మునిగాల వెంకటేశ్వర్లు, రామిడి సురేష్, బొనగాని యాదగిరి, గులగట్టు విజయరావు, కె.వెంకటాచారి, లింగంపల్లి శ్రీనివాసరావు, టీవీ.చౌదరి, బొక్క బాబారీరావు, కాసుల అశోక్, రాగం రవికుమార్, కుమార్ పాల్గొన్నారు.