Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలోని చిన్నవంగర గ్రామంల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల పనిదినాలు, కూలీ రేట్లు, తదితర వసతులను గురించి వారిని అడి గి తెలుసుకున్నారు. అనంతరం. ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఎండవేడిమికి గురికాకుండా ఉదయం పూటే పనులకు వచ్చి సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.పనుల్లేని కూలీలకు ఉపాధిహామీపనులు ఎంత గానో తోడ్పడుతాయన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ యాకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బోయిని ఉపేందర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.