Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డం ఖాయమని ప్రతి ఒక్కరూ కార్యకర్త కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా పిలుపు నిచ్చారు.శుక్రవారం జనగామ జిల్లా నర్మేట మండలంలో జరిగిన పాదయాత్రలో భట్టి విక్రమార్కతో పాటు సింగపురం ఇందిరాను శాలువాతో ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ మనదే కష్ట పడి పని చేస్తూ సమిష్టి కృషి చేయాలని వారు కోరారు.రాహుల్ గాంధీ నాయక త్వంలో కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు ఇస్తుందని వారు తెలిపారు. కేంద్రంలోని మతతత్వ బిజెపి పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ అవలంభి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటా వివరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేకల నరేందర్, లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు కోళ్ల రవిగౌడ్, కావటి భాస్కర్ యాదవ్, ఎంపీ టీసీలు అలిబిలి కృష్ణ, మండల ప్రచార కార్యదర్శి రాజకుమార్ పాల్గొన్నారు.