Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. భారత్ జూడో యాత్రలో భాగంగా భట్టి విక్రమార్క పాదయాత్ర మండల పరిధిలోని అబ్దుల్నాగారం గ్రామంలో శుక్రవారం ప్రారంభమైంది. పాద యాత్ర ప్రారంభంలో ఇరువర్గాల వారు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు భట్టి విక్రమార్కకు స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు.ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పొన్నాల, కొమ్మూరి మద్దతుదారులు తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటక ముందే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థిక సాధికారత కోసం డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని భట్టి పేర్కొన్నారు. నిరు ద్యోగులకు ఉపాధి కల్పించి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి బిడ్డకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామ ని భరోసాను కల్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పొన్నాల, కొమ్మూరి వర్గాలకి చెందిన కార్యకర్తలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.