Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
పిఎసిఎస్ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని చైర్మన్ చల్ల లింగా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైతులు దళారు లను నమ్మి మోసపోకూడదని వరి ధాన్యం సెంటర్లకే తీసుకొచ్చి ధాన్యం శుభ్రం చేసి, తేమశాతం 17లోపు ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నట్లయితే ధాన్యానికి మద్ద తు ధర లభిస్తుందని, మండలంలో మొక్కజొన్న కొనుగోలు కూడా ఓడిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం పిఎసిఎస్ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, రైతులు సద్వి నియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఏం.అశోక్ కుమార్, వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, గూడూరు సర్పంచ్ నునావత్ రమేష్, గూడూరు ఎంపీటీసీ కత్తి స్వామి, సొసైటీ డైరెక్టర్లు ఎడ్ల రమేష్, గ్రామ పెద్దలు సంపత్ రావు కటార్ సింగ్, సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.