Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీకాంత్ రావు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలో ఇల్లెందు రోడ్లో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ నిర్మాణంలో భూమి కోల్పోయిన బాధితుడు ఎండి ఇబ్ర హీంకు విచారణ నిర్వహించి భూ మి బదులు భూమి ఇస్తానని దేవ దాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీకాంత్‌రావు తెలిపారు.శుక్రవారం శ్రీకాంత్ రావు దేవాదాయ శాఖ అధికారులు, సీపీఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య పెట్రోల్ బంకు వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పెట్రోల్ బంకు నిర్మాణం లో దేవదాయ శాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకొని నిర్మించారు. పెట్రోల్ బంక్ నిర్మాణంలో తన రెండు గుంటల వ్యవసాయ భూమి కోల్పోయానని ఎండి ఇబ్రహీం దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో దేవదాయశాఖ అధికారులు వచ్చి విచారణ నిర్వహించారు.ఈ మేరకు శ్రీకాంత్‌రావు మాట్లాడు తూ రెవిన్యూ శాఖ అధికారులతో పూర్తిస్థాయి విచారణ నిర్వహించి తమ శాఖ అన్నతాధికాలకు నివేదికలు పంపించి భూమి కోల్పోయిన బాధితుడికి ఇబ్రహీంకు భూమి బదులు భూమి ఇస్తామని ఆ ధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. తన భూమి కోసం గత ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నానని ఇబ్రహీం తెలిపారు. భూమి పై విచారణ నిర్వహించి భూమి విషయం తేల్చాలని అని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో దేవాదాయశాఖ అధికారులు సరిత కవిత బిక్షపతి పాల్గొన్నారు.