Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
పంట నష్టపోయిన ప్రతి రైతు ను గుర్తించాలని పరిహారం ఇవ్వా లని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చెంచు శ్రీశైలం డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ పిలుపు మేరకు మహబూబాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో వేమునూర్ గ్రామంతో పాటు ఆ పరి ధిలోని ఉత్తర తండా, రాయకుంట తండాల్లో అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నేలమట్టమైన పంటలు, చేలను సందర్శించడం జరిగింది. సుమారు 12 మంది నాలమాససాయి, గుగులోత్ భిక్కు, వంకుడోత్రై శంకర్, బోడ రాజకుమార్, మా లోత్ రమేష్, బానోత్ వెంకన్న, బానోత్ బాల్య, వంకుడోత్ మాలు రైతుల పొలా లు, చేలు నేల మట్టమై ఉండి బురదలో పడిపోవడం వల్ల ధాన్యం గింజలు మొల కెత్తుతాయని, కుళ్ళిపోతాయని రైతులు తెలిపారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక పోవడం, చేసినకష్టం వృథా కావడంతో రైతులు అప్పుల పాలయ్యే దుస్థితి ఏర్పడిం దని అంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలం దరూ రైతుల పిల్లలేనని, రైతులు బాగుంటేనే మొత్తం సమాజం సంతోషంగా ఉం టుందన్నారు.ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరినీ మినహాయించకుం డా ఆర్థిక సాయం అందించాలని, తడిసి పాడైన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చుం చు శ్రీశైలం, పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బలాస్టి రమేష్, జిల్లా కార్యదర్శి చీకటి ఉపేందర్, మండల అధ్యక్షులు రాచకొండ ఉపేం దర్, ప్రధాన కార్యదర్శి సజ్జనము విద్యాసాగర్, బి.రాజు, డి.మోహన్, బి.మోహన్, కోడూరి శ్రీనివాస్, రఫీ, అవునూరి రవి, జి.మురళి తదితరులు పాల్గొన్నారు.