Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్‌లో గత 20 సంవత్సరాలుగా నెలకు 3900 రూపాయలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న వీవోఏలకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని, వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్ ఇ వ్వాలని, వారికి ప్రమోషన్లు, బీమా సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. వీవోఏలు తమ సమస్యల పరి ష్కారానికి నిరవధిక దీక్షలు చేస్తున్న బయ్యారం దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభా వం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సెర్ప్ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని గుర్తిం చకుండా ప్రభుత్వం వారిని కట్టుబానిసలుగా చూస్తు న్నదన్నారు. మార్చి 18వ తేదీన సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తీసుకొచ్చిన జీవోలో వివోఏలకు స్థా నం లేకపోవడం శోచనయమన్నారు. గతంలో వీఆర్ ఏలు, గ్రామపంచాయతీ వర్కర్లు, మున్సిపల్ కార్పొరే షన్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు లాంటివారు తమ స మస్యల పరిష్కారానికి సమ్మెలు చేసినా కేసీఆర్ ప్రభు త్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వీవోఏల సమ స్యల పై కూడా స్పందించడం లేదని, ఇది కేసీఆర్ ని యంతత్వ వైఖరికి ఫ్యూడల్ స్వభావానికి నిదర్శనమ న్నారు. వీవోఏలతో ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని, వారి సమస్యలు పరిష్కరించాల ని ఆయన డిమాండ్ చేశారు. వారి సమ్మెకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలియజే స్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నాగేశ్వరరావు, పాయంసమ్మయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : తమ సమస్యల పరిష్కారం కోసం వీఓవోలు చేపడుతున్న నిర్వాహక సమ్మె శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరింది. నిరసన కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలో ఉన్న షాపు లను తిరుగుతూ బిక్షాటన కార్యక్రమం నిర్వహించా రు. మండల వివోఏల యూనియన్ అధ్యక్షురాలు దా రం శ్రీలత, కార్యదర్శి నానబాల పురుషోత్తం, కోశాధి కారి మల్లె బొయిన శ్రీలత, క్లస్టర్ బాధ్యులు కళ్యాణ్, లక్ష్మయ్య, సుగుణ, మల్లేష్, వెంకటలక్ష్మి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.