Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 5,6 తేదీలలో భద్రాచలంలో రాష్ట్ర మహాసభలు - దుగ్గికృష్ణ
నవతెలంగాణ-గార్ల
జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల పరిరక్షణకై ప్రాణాలు అర్పించిన కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల పోరాట స్పూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గికృష్ణ అన్నారు.స్దానిక మంగపతిరావు భవనంలో శుక్రవారం చింత బాబు అధ్యక్షతన జరిగిన సంఘం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వామపక్షాల ఒత్తిడి మేరకు ఆదివాసీల హక్కుల కొరకు తీసుకువచ్చిన పోడు భూముల చట్టాన్ని నిర్వీర్యం చే సేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వెలిబుచ్చా రు.అటవీ సంపద, అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడా నికి బిజెపి ప్రభుత్వం పనుకుంటుందని ఆదివాసీల ప్రాంతాల్లో భూములు, ఉద్యో గాలు, హక్కులు వారికే ఉండాలని, రాజ్యాంగంలో పొందుపరచిన ఆదివాసీ గిరి జన హక్కులను పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆదివాసీల సం స్కృతి,జీవన స్ధితి గతులు, అటవీ సంపదల వారసత్వాన్ని భవితరాలకు అందిస్తూ విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దరఖాస్తులు చేసుకున్న పోడు సాగుదారులు అందరికీ పోడు హక్కులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మే 5,6 తేదీలలో భద్రాచలంలోజరిగే ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర మహసభలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు హజరు అవుతున్నారని ఈ మహాసభలకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సులో రాష్ట్ర నాయకు లు పి.సోమయ్య, సూడి కృష్ణారెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు, నాయకులు వెంకటేష్, రాంబాబు, కాంతారావు, వసంత రావు పాల్గొన్నారు.