Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
గత సంవత్సరం జనవరి 2022లో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు శుక్రవారం వంట నష్టపరిహారం చెక్కులను మండల వ్యవసాయ అధికా రి చట్ల యాకయ్య ఆధ్వర్యం లో గవిచర్ల రైతువేదికలో రై తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ యాకయ్య మాట్లాడుతూ గవిచర్ల క్లస్టర్ పరిధిలో 64మంది రైతులు 28 హెక్టార్లలో పంట నష్టపోగా అందుకు రూ. 2,48,341ల విలువగల చెక్కులు, కాపులకనపర్తి క్లస్టర్లో 78 మంది రైతులు 22.12 హెక్టార్లలో పంట నష్టపోగా అందుకు రూ.2,07,093ల విలువగల చె క్కులు వచ్చాయని అన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ కందగట్ల నరహరి, జిల్లా రైతు సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ సాగర్ రెడ్డి, సర్పంచ్ దొనికెల రమా శ్రీనివాస్, ఎంపీటీసీలు గూడ సంపత్ రెడ్డి, సుతారి బాలకష్ణ, వివిధ గ్రామాల రైతు కో-ఆర్డినేటర్లు రామచంద్రారెడ్డి, దిలీప్ కుమార్, కరుణాకర్, ఏఈఓలు సాగర్, గీత, భారతి, నాయకులు భాస్కర్ రెడ్డి, గోవర్ధన్, రాజిరెడ్డి వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.