Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ వైస్‌చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు
నవతెలంగాణ-ఐనవోలు
రైతాంగ శ్రేయస్సుకోసం ప్ర భుత్వం ఏర్పాటు చేస్తున్న ధా న్యం కొనుగోలుకేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జెడ్పీ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు అన్నారు. శుక్రవారం నందనం రైతుసేవా సహకార సంఘం ఆధ్వ ర్యంలో పంథిని, పున్నేలు, వెంకటాపురం గ్రామాల్లో సంఘం అధ్య క్షులు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆదేశాల మేరకు సొసైటీ ఉపాధ్య క్షులు తక్కళ్లపల్లి చందర్రావు నాయకత్వంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరాములు మాట్లాడుతూ ప్రతి రై తుధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోయినపల్లి సోమేశ్వర్రావు, చాట్ల అరుణ, సర్పంచ్ కరిమిల్ల ప్రేమలత పూర్ణచందర్రావు, సర్పంచ్ కత్తి దేవేందర్, గోకే రేణుక శ్రీనివాస్, గ్రామ రైతు కన్వీ నర్ బండి శీను, ఏఈఓ సువర్ణ, మాజీ సర్పంచ్ బరిగల సదానందం, సొసైటీ డైరె క్టర్లు వడిచెర్ల శ్రీనివాస్, మాదారం సంపత్‌రావు, పూజారి రామచంద్రం, చింతా బాబు, మేటి చిరంజీవి, వెంకన్న, ప్రతాప్ రావు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.