Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సీనియర్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ
- సేవాధికార సంస్థ కార్యదర్శి టి మాధవి
నవతెలంగాణ - ములుగు
కార్మికులు వారి హక్కులను వినియోగించుకోవాలని జిల్లా సీనియర్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి మాధవి తెలిపారు. మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా బస్టాండ్ ఆవరణ ములుగులో ఆర్టీసీ కార్మికులు, ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయ కుల ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవంను ఘనంగా నిర్వహిం చుకున్నారు. ముఖ్య అతిథులుగా టీ మాధవి పాల్గొని మాట్లా డుతూ ప్రపంచంలో కష్టపడే ప్రతివారూ కార్మికులేనని, శ్రమించే ప్రతివారూ శ్రామికులే నని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి,వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి సౌఖ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ములుగు వి వినోద, ములుగు బారాసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ వేణుగోపాల చారి, న్యాయవాదులు బి చంద్రయ్య, కే సునీల్ కుమార్, బి స్వామి దాస్, సిహెచ్ రాజేందర్, ఆర్ రాజ్ కుమార్, కే రవీందర్, బి సుధాకర్ కంట్రోలర్ ములుగు బస్ స్టేషన్, కండక్టర్లు, బస్ డ్రైవర్లు,ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు.