Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరా టాలకు సిద్ధం కావాలని భారత కార్మిక సంఘాల సమైక్య మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. సోమవారం తోర్రూరులో 138వ మే డే సంద ర్భంగా మున్సిపల్ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జండా ఆవిష్కర ణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ బహుళ జాతి కంపె నీలకు లబ్ధి చేకూర్చటానికే కార్మిక చట్టాలను సవరించి పని గంటల పెంపు అని అన్నారు. పనిగంటలు తగ్గించాలని, మెరుగైన వేతనాలు అందించాలని,భద్రతతో కూడిన ఉపాధి కల్పించాలని, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడు తుందన్నారు. పెరిగిన ధరల భారంతో చాలీచాలని జీతాలు పొందుతున్న కార్మిక వర్గం అర్దాకలితో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీక రిస్తూ భారత రాజ్యాంగం ఇచ్చిన కనీస హక్కులను కాలరా స్తున్న బిజెపి ప్రభుత్వంపై కార్మిక వర్గం తిరగబడాలన్నారు. మతం పేరుతో, దేశభక్తి పేరుతో ప్ర జల మధ్య చీలిక తెచ్చి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ పోరాడే శక్తులకు నిర్వీర్యపరుస్తు న్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మోడీకి వ్యతిరేకమంటూనే మోడీ తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధా నాలను రాష్ట్రంలో ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయటం కార్మిక ద్రోహమే అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రం లోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీలంగా ఐక్య పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. మున్సిపల్ ఆఫీసు వద్ద యూనియన్ అధ్యక్షుడు ప్రసాద్, రామకృష్ణ టాకీస్ అడ్డ వద్ద రిక్షా కార్మిక నాయకులు వెంకన్న, గెస్ట్ హౌస్ వద్ద కొత్తపల్లి రవి జండాలను ఆవిష్కరిచి భారీ ర్యాలీ నిర్వహించారు.