Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యో గాలు క్రమబద్ధీకరించాలని పలు డిమాండ్ తో కూడి న సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు వెళ్లిన విష యం విధితమే. దీని ప్రభావం పంచాయతీల మీద పడి పంచాయతీ పాలనలు స్తంభించిపోయాయి. గ్రా మాల్లో జనన మరణ, వివాహ ఇతరత్రా ధ్రువపత్రాల జారీ విషయంలో గ్రామ ప్రజలు గ్రామాలలో పంచా యతీ కార్యదర్శులు లేక ఇబ్బందులకు గురవుతున్నా రు. ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్క రించి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఉద్యోగులు మండల అధ్యక్షులు కాసుయాకయ్య ఆధ్వర్యంలో జూ నియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మం గళ వారం మద్దతుగా నిలిచారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్లడంతో పల్లెలో పచ్చదనం కరువైందని, పారిశుద్ధ్యం లోపించిందని, గ్రామాలలో అనేక సమస్యలు పేరుకపోయాయని మల్టీ పర్పస్ సిబ్బంది పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సేవలను గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగాలను క్రమబద్ధీకరిం చా లని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలో నిరవధిక సమ్మెలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అంబటి వరు ణ్కుమార్, భూక్యసుధాకర్,కాసులరాంబాబు, హు స్సేన్, యుగంధర్, బైరు సోనీ, బత్తినిఉష ,చిట్టె హై మ, దివ్య, ఆబేధబేగం, కారోబార్లు రాములు, కత్తి కుమారస్వామి, సందీప్, రమేష్ తో పాటు తదితర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు .
పర్వతగిరి : సీఎం కేసీఆర్ జీ కష్టపడి సంపా దించిన నౌకరిలో కష్టపడి పనిచేస్తున్నామని, ఇప్పటి కైనా మా గోడువిని మా గోస తీర్చి మా జీవితాల్లో వె లుగులు నింపాలని జూనియర్ పంచాయతీ కార్యద ర్శులు వేడుకున్నారు.
పర్వతగిరి మండలంలోని ఎంపిడివో కార్యాల యం ఎదుట మంగళవారం 5వ రోజు శాంతియుత ధర్నా నిర్వహించారు. మా ఉద్యోగాలకు వెంటనే భద్ర త కల్పించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షుడు ఎండి.మోయిన్ కోరారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, రె గ్యులరైజ్ కోసంఆశగా ఎదురుచూస్తున్నామని, కష్టప డి ఉన్నత చదువులు చదివి గ్రామాలకు సేవ చేయా లనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, తెలంగాణ జూనియ ర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రతిపాద నలన్నింటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ శాంతియుత నిరసన కార్యక్ర మానికి ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్య దర్శి జి.సంతోష్, ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, బి రాజు పలు గ్రామాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.