Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండల పరిధిలోని ధర్మ రావు పేట గ్రామ శివారులో అనుమతులు లేకుం డా నిర్మాణాలు చేస్తున్న ఫంక్షన్ హాల్ యజమానిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫంక్షన్ హాల్ యజమాని నిర్మాణ పనులు మొదలుపెట్టి గత నాలుగు నెలలు గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం వ్యవసాయ భూమిలో కడుతున్న ఫంక్షన్ హాల్ కి మొదటగా తాసిల్దార్ ఆఫీస్ నుండి నాలా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యజమాని ఇవేమీ పట్టన ట్టుగా ఏకంగా నిర్మాణం మొదలుపెట్టి ఫంక్షన్ హాల్ చివరి దశ వరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించడం గమనార్హం. జీవో నెంబర్ 168 ప్రకారం సూ చించిన పలు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించి డిస్టిక్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా అనుమతి పొందిన అనంతరం గ్రామపంచాయతీ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎటువంటి అ నుమతులు పొందకుండా నిర్మాణాలు చేపట్టడం పలువురు గ్రామస్తులను ఆలో చింపచేస్తుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమతులేని లేకుండా ని ర్మాణం చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నా రు. అక్రమ నిర్మాణ పనులపై ధర్మరావుపేట పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ని వివరణ కోరగా అనుమతుల్లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేస్తుండడం వాస్తవమేనని, గ్రామపంచాయతీ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని గత వారంలో యజమానికి నోటీసు జారీ చేశామని తెలిపారు. నిర్మాణ పనులు వ్యవసాయ భూముల్లో జరుగుతుండడంతో తహశీల్దార్ కార్యాలయం నుండి నా లా, ప్లానింగ్, తదితరదరఖాస్తులు సమర్పించాలని కోరడం జరిగిందని తెలిపారు.