Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం
నవతెలంగాణ-పర్వతగిరి
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకోవా లని సామాజిక ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ మరిం గంటి యాదగిరాచార్యులు, ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపురమేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమి టీ సభ్యులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సం ఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డి మాండ్ చేశారు.అఖిల భారత రైతు సమైక్య (ఏఐకె ఎఫ్), అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎం ఎస్), తెలంగాణ రైతు సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పర్వతగిరి మండలం లోని కొంకపాక, గోపనపల్లి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం వారు సందర్శించి, ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రచార ఆర్భాటంతో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేసి కుంటున్నట్లుఅధికార యం త్రాంగం చెబుతు న్నారని కానీ ఆచరణలో అందుకు పూర్తివిరుద్ధంగా రైతుల వరిధాన్యాన్ని కొనుగోలు చే సే కేంద్రాల్లో కనీస వస తులు కూడా లేవని ఏర్పా టు చేసి మూడురోజులు దాటిన ఒక్కకిలో కూడా కొ నుగోలు చేయలేదని కనీ సం రైతులకు కావాల్సిన పరదాలు సైతం ఇవ్వలేద న్నారు. దీంతో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్న దని కొంతమంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 20 రో జులు దాటినా కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం 18 లోపు ఉన్న టోకెన్స్ గోనె సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని స్థానిక సెంటర్లలో ఉం డాల్సిన సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఇలాం టి పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో భయాందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా దాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించి రైతు లకు టోకెన్లు అందించి గోనె సంచులను సరఫరా చేసి సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు.ఈ కార్యక్రమంలో ఏఐకెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి.ఇస్మాయిల్, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.