Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచా యతీ కార్యాలయం ఆవరణలో మం గళవారం పర్వతగిరి విద్యుత్ ఏడిఈ చంద్రమౌళి అధ్యక్షతన విద్యుత్ విని యోగదారులకు,సిబ్బందికి అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీ.ఈ బిక్షపతి మాట్లా డుతూ వర్షాలు, భారీ గాలుల కార ణంగా విరిగిన విద్యుత్ స్తంభాలను, తెగిపడిన విద్యుత్ తీగలను ముట్టుకోవడం వలన విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని, పై వాటిని గమనించిన వెంటనే సమీపంలోని విద్యుత్ అధికారికి తెలియజేయాలని, సంబంధిత విద్యుత్ సిబ్బంది వీటిని వెంటనే సరిచేస్తారని తెలిపారు. అలాగే వివిధ రకాల వ్యవసాయ పంపు సెట్టును వినియోగించినప్పుడు కరెంటు మోటార్ల ఫుట్ వాల్వులు, సర్వీస్ వైర్లకు ఇమ్యులేషన్సరిగా లేకపోవటం కారణం గా విద్యుత్ ప్రసారం తో పలు ప్రమా దాలు జరుగుతు న్నాయని అన్నారు. పర్వతగిరి విద్యుత్ ఏడిఈ చంద్రమౌళి మాట్లాడుతూ విద్యుత్ వాడకం లో తగిన మెళుకువలు, జాగ్రత్త లు పాటిస్తే ఎలాంటి ప్రమాదా లు జరుగకుండా రక్షించుకోవ చ్చని తెలిపారు. అత్యవసర సమ యం టోల్‌ఫ్రీ 18004250028 హెల్ప్ లైన్ నెంబర్ ను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్వతగిరి, ఏనుగల్ సబ్ స్టేషన్ ఏ ఈ రవి,పర్వతగిరి, పర్వతగిరి పంచాయతీ కార్యదర్శి రఘు, విద్యుత్ సిబ్బంది పర్హీన్, వినియోగ దా రులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.