Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీఎస్, ఓపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలి
నవతెలంగాణ-మల్హర్రావు
జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యద ర్శులను రెగ్యులరైజ్ చేయాలని మండల కారోబార్ సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యదర్శుల నిరవధిక సమ్మె మంగళవారం 5వరోజు కొన సాగింది. పంచాయతీ కార్యదర్శులకు మండల కారోబార్ ల సంఘం సంఘీభావాన్ని ప్రకటించింది. సంఘం నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నోటిఫికేషన్ ప్రకారం 3 సంవత్సరాలకే రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉన్నా, ప్రొబే షనరీ కాలాన్ని సంవత్సరం పొడిగించి 4 సంవత్స రాలుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొబేషనరి పూర్తియినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం దురదృష్టక రమన్నారు. గ్రామపంచాయతీస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సిబ్బందితో కలిసి కష్టపడి పని చేయటం ద్వారా గ్రామలన్ని సస్యశ్యామలం అయ్యా యన్నారు. వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. సంఘీభావం ప్రకటించిన మండల కారొబార్ల సంఘానికి కార్యదర్శులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమ్మెలో కూర్చున్న జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు అల్పాహారం అందించారు.
మహదేవపూర్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 5వ రోజుకు చేరిన సందర్భంగా మహాదేవపూర్ ఎంపీపీ బన్సోడ రాణిభారురామారావు, పలిమెల ఎంపీపీ కుర్సం బుచ్చక్క, ఎంపీటీసీ దంధేర కళ్యాణి, బొమ్మపూర్ సర్పంచ్ ఓడేటి పద్మా రవీందర్ రెడ్డి, కుదురు పల్లి సర్పంచ్ కోట లక్ష్మీసమ్మయ్య, ఎడపల్లి సర్పంచ్ కుమ్మరి చిన్న మల్లయ్య, కాలేశ్వరం ఎంపీటీసీ రేవల్లి మమత నాగరాజు, పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ మోదేడు సర్పంచ్ చిడెమ్ నాగయ్య మద్దతు తెలిపారు. కార్యదర్శుల డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. అలాగే మహదేవపూర్ మండల కేంద్రంలో పంచాయితీ కార్యదర్శి లకు పలిమెల ఎంపీపీ బుచ్చక్క, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రాంమోహన్‌రావు, ఎంపీటీసీ దందేరా కల్యాణి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దందెర రాజేందర్ మద్దతు తెలిపారు.
మహాముత్తారం : మహముత్తారం మండల పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు ఎంపీపీ రత్నం సుభద్ర మంగళవారం మద్దతు తెలిపారు. ఓపిఎస్, జెపిఎస్ అందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకొని మూడేళ్లలో రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక చాలామంది చనిపోయారని, మరి కొంత మంది రాజీనామా చేశారని అన్నారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలను రెగ్యులర్ చేయాలని అన్నారు. వైస్ ఎంపీపీ ఉమా దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ లింగమల్ల శారదదుర్గయ్య, బోర్లగూడెం ఎంపీటీసీ వసంత రూప నాయక్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ వెల్మరెడ్డి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాటారం : కాటారం మండలం పరిషత్ కార్యా లయం ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేమునురి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకానీ సమ్మయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులను నాలుగు సంవత్సరాలుగా వ్యక్తి చాకిరీ చేయించుకుని రెగ్యులైజేషన్ చేయకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులైజేషన్ చేయా లని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపుని చ్చినా తాము మద్దతిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సమ్మయ్య, పిసిసి మహిళ కార్యదర్శి సుగుణ, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రమేష్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షు రాలు ఎంపీటీసీ జాడి మహేశ్వరిరమేష్, యూత్ అధ్యక్షు లు చీమల సందీప్, సర్పంచ్ రఘురాంనాయక్, జూని యర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.