Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ డిఈ పులుసం నాగేశ్వరరావు
నవతెలంగాణ- తాడ్వాయి
విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ డీఈ పులుసం నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో ప్రజా ప్రతినిధులు, విద్యుత్ వినియోగదారులతో ఏఈ వేణు కుమార్ అధ్యక్షతన విద్యుత్ భద్రత వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యుత్ భద్రత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ డిఈ పులుసం నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్తును ఆదా చేయడంతో పాటు, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. రైతులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన విద్యుత్ అధికారులు సిబ్బందికి సమాచారం అందించాలని, సొంత పనులతో ప్రమాదాల బారిన పడద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు చేయడానికి కార్పొరేట్ కార్యా లయం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 0870- 2461552, 0870- 2461505 నంబర్లకు గాని, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 0028 లేదా 1912కు ఫోన్ చేయాలన్నారు. ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్ మాట్లాడుతూ విద్యుత్తును అవసరా లకు అనుగుణంగా వాడుకోవాలని, విద్యుత్ వాడకం పట్ల జాగ్రత్తగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్, లైన్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు, లైన్మెన్ కూచన సతీష్, జేఎల్ఎం షేక్ అమీర్ పాషా, తాడు సబ్స్టేషన్లో విద్యుత్ సిబ్బంది, ఆపరేటర్లు, మండల ప్రజా ప్రతినిధులు, అగ్రికల్చర్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.