Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ
- సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు గొంది రాజేష్, రాష్ట్ర నాయకులు తవిటి నారాయణ
నవతెలంగాణ - ములుగు
సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరాటా లకు సిద్ధం కావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు గొంది రాజేష్, రాష్ట్ర నాయకులు తవిటి నారాయణ పిలుపునిచ్చారు. మండల పరిధి రాయినిగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో సంఘం ములుగు మండల మూడో మహాసభ మంకిడి కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅతిధిగా వారు హాజరై మాట్లాడుతూ లక్నవరం చెరువు ముంపున కు గురవుతున్న భూముల రైతులందరికి నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. కాస్త్తులో ఉన్న పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల సంరక్షణ కోసం ఈనెల 5,6 తేదీలలో భద్రా చలంలో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ చేసి సంఘం ములుగు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా మంకిడి కష్ణ ప్రధాన కార్యదర్శి గా కొటేం లింగస్వామి, ఉపాధ్యక్షులుగా గొంది రవికుమార్, ఈసం ముత్తారావు, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆరు జీపీల పరిధి 50మంది గిరిజనులు పాల్గొన్నారు.