Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఓ మహిళను బెదిరించి బలవంతంగా అత్యాచారంచేసిన ఐదుగురు నింది తులను ఏనుమాముల పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏనుమాముల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మామునూరు ఏసీపీ కృపాకర్ వి వరాలు వెల్లడించారు. వరంగల్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివా హిత గత నెల 20న పని నిమిత్తం అదే గ్రామానికి చెందిన రేవతి అనే మహిళతో కలిసి ఆరేపల్లికి వెళ్ళగా అక్కడ రేవతికి తెలిసిన ములుగుజిల్లా జంగాలపల్లి గ్రామా నికి చెందిన సంపంగి రవి అనే వ్యక్తి కారులో వచ్చి ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక రేవతి కారులో నుండి దిగిపోయింది. తర్వాత కొంత దూరం వెళ్ళాక మరో ముగ్గురు వ్యక్తులు కారులో ఎక్కారు. వీరు అయిదుగురు వ్యక్తులు సదరు మహిళలను బెదిరించిబలవంతంగా మేడారం అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేయగా మిగతా ఇద్దరు వ్యక్తులు వీరికి సహకరించారు. సదరు మహిళా నన్ను వదిలేయండి అని ప్రాధేయపడగా జరిగిన విషయంఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వరం గల్ వైపు వచ్చే బస్సు ఎక్కించారు. మహిళ ములుగు రోడ్డు వద్ద దిగి తన భర్తకు ఫోన్‌చేయగా ఆయన ఇంత ఆలస్యం ఎందుకుఅయిందని గద్దించగా ఆమె భయ పడి కరీంనగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం గత నెల 29న ఏనుమాముల పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా నిందితుల కోసం గాలించి మంగళవారం వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పోలీసు లు అరెస్టు చేసిన నిందితుల్లో ములుగు జిల్లా జంగాలపల్లి కి చెందిన సంపంగి రవి, చల్వాయి ప్రాంతానికి చెందిన దున్నపోతుల నాగరాజు, హనుమకొండ ప్రాం తానికి చెందిన బొంతు లక్ష్మణ్, ములుగు జిల్లా జంగాల పెళ్ళికి చెందిన అలకుంట్ల రమేష్ వర్ధన్నపేట మండలం ఫిరంగి తండకు చెందిన ఓర్సు సుధాకర్లో ఉ న్నారు. సమావేశంలో ఏనుమాముల సీఐ మహేందర్ పాల్గొన్నారు.