Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి రాజునాయక్ గిరిజన రైతు ఇటీవల పారెస్ట్ అధికారుల వేధింపులతో మనస్తాపం చెంది గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినటు తెలుస్తోంది. 25 రోజుల క్రితం అటవీశాఖ అధికారుల వేధింపుల వల్ల మృతి చెంది న రాజునాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా, మండల ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీతోపాటు పలు గిరిజన సంఘాలు ధర్నాలు రాస్తా రోకోలు చేశాయి. వారం రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావుకు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సైతం సమర్పిం చారు. ఈ మేరకు గిరిజన శాఖకు చెందిన డిటిడిఓ దొంతుబోయిన వెంకన్న, తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సరిత, అటవీశాఖ అధికారులు కొయ్యూరు రేంజ్ అధికారి కిరణ్, డ్యూటీ డేంజర్ కొమురయ్య, సెక్షన్ అధికారి ఇంతియాజ్ అలీ, బీట్ అధికారి వనజ మంగళవారం విచారణ చేపట్టారు. రాజునాయక్ భూముల పత్రాలు, భూ హద్దులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీర పూల్ సింగ్ నాయక్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు అజ్మీర సమ్మయ్య నాయక్, రమేష్ నాయక్ మోహన్ నాయక్ కష్ణ నాయక్ కిషన్, రాజు నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.