Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందర్శకులే భాగస్వాములై నిర్మాణాలు
- ఏకకాలంలో 30 వేలమంది ప్రార్థనలకు వీలు
- ఈ నెల 4న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ప్రారంభం
నవతెలంగాణ-ధర్మసాగర్
ఈనెల 6న ఆసియా ఖం డంలోనే అతిపెద్ద చర్చి ప్రార ంభోత్సవం ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్ర మంలో పాల్గొని విజయవంతం చేయాలని దైవజనులు పాల్సన్ రాజ్, జయప్రకాష్ పిలుపు నిచ్చారు. మంగళవారం మండ లంలోని కరుణాపురం గ్రామంలో క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో దైవజనులు పాల్సన్ జై ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి నిర్మాణం చేయడానికి సందర్శకులే భాగస్వాములుగా ఉండి నిర్మాణానికి సహకరించడం గొప్ప విశేషం అన్నారు. చర్చి నిర్మాణానికి ప్రతిరోజు దాదాపు 500మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా నిర్మించామన్నారు. ఈ ప్రార్థన మందిరాన్ని ఈనెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభించడానికి సిద్ధమైందని తెలిపారు. ఈ నిర్మాణం సందర్శకుల సౌకర్యార్థం ఏకకాలంలో 30వేల మంది ప్రార్థన చేసేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ అద్భుత కట్టడాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు,మంత్రులు వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని, విజయవంతం చేయాలని కోరారు.