Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామములో మెడికల్ సబ్ సెంటర్ నిర్మాణం కొరకు రూ.20 లక్షలు మంజూరు కాగా స్థల పరిశీలన చేశారు. గ్రామానికి చెందిన గుర్రాల వెంకటరెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మెడికల్ సబ్ సెంటర్కు రెండు గుంటల స్థలాన్ని ఇస్తానని అంగీకరించారు. స్థల పరిశీలన కార్యక్రమానికి జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీఓ ఆశలత, మండల ప్రత్యేక అధికారి సామ్యేలు, ఎంపీడీవో సురేందర్, తాసిల్దార్ షర్ఫుద్దీన్ , మెడికల్ ఆఫీసర్ హిమ బిందు ఎంపీ ఓ రాంప్రసాద్ స్థానిక సర్పంచ్ సంధ్య వెంకటేశ్వర్లు పాల్గొని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించారు.