Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్
నవతెలంగాణ-హన్మకొండ
పత్రిక స్వేచ్ఛను ఆరెస్సెస్ బీజేపీ మతోన్మాద శక్తులు హరి స్తున్నాయని డివైఎఫ్ఐ హన్మ కొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. బుధవారం ప్ర పంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ హన్మ కొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల విజరుకుమార్ అధ్యక్షతన ప్ర ముఖ పత్రికేయురాలు గౌరీలంకేశ్ చిత్ర పటానికి పూలమాల వేసి స్మరించు కు న్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వే చ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారన్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం జరిగిందన్నారు. ఆరెస్సె స్ బీజేపీ మతోన్మాదులు పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నాయని, నిజాన్ని నిర్భయంగా వినిపించే జర్నలిస్టుల గొంతుకలను కొస్తుందన్నారు. అందులో భాగంగానే జర్నలి స్ట్ గౌరీలంకేశ్ను కాల్చిచంపారన్నారు. పత్రికకు స్వేచ్ఛకల్పిస్తేనే సమాజంలో జరిగే పరిస్థితులను నిర్భయంగా వార్తలు రాయగలరన్నారు. దాని ద్వారా ప్రజల్లో చైత న్యం పెరిగి సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు చిలుక జంపన్న, అనంతగిరి దేవేందర్, పండగ శివాణి, పాశం శ్రావణి, మడికొండ కుమార్, ప్రణయ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.