Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్య, వైద్య ఉపాధి హక్కుల సాధనకై ప్రతి ఒక్కరు ఉద్యమించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ పిలుపునిచ్చారు బుధవారం జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీకాంత్ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం కొమురయ్య భవన్లో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతో న్మాదానికి, కాషాయ భావజాలానికి వ్యతిరేకంగా ఉద్య మించాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని అలాగే ప్రయి వేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీ నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు యువతను దూరం చేసే ప్రయ త్నం చేస్తుందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని, నిరు ద్యోగులందరికీ నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఇస్తానని గద్దినెక్కి నేడు హామీనే మరిచిందన్నారు. జాబ్ క్యాలెండర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. యువకులు హక్కులు సాధించేంతవరకు వారికి అండగా ఏఐవైఎఫ్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్క్ ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు తిరుపతి, వెంకటేష్, ప్రేమ్ కుమార్, రమేష్ చారి, శేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.